Monday, December 23, 2024

శ్రీవల్లి టౌన్ షిప్ కు విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

14,15,16,17 తేదీలలో భౌతిక వేలం ద్వారా విక్రయం

Special response to Srivalli Township

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: నార్కెట్‌పల్లి మం డలం ఎల్లారెడ్డి గూడ గ్రామ పంచాయితీ నార్కెట్‌పల్లి అద్దంకి హైవే ప్రక్కన మహాత్మాగాంధీ యూ నివర్సిటీ ఎదురుగా ప్రభుత్వం ద్వారా రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షిప్ ఓ పెన్ ప్లాట్ల వేలంపై నిర్వహించిన మూడవ ప్రీబిడ్ సమావేశానికి విశేష స్ప ందన లభించింది. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భ వన్‌లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడవ ప్రీ బిడ్ సమావేశానికి ఔత్సాహిక బిల్డర్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి చిక్కులు లేని ప్లాట్లను మార్చి 14,15,16,17తేదీలలో నిర్వహించే భౌతిక వేలంలో పాల్గొని స్వంతం చేసుకోవచ్చన్నారు.

చదరపు గజానికి 10వేల రూపాలు ఉ న్న కనీస ధరను ప్రజల అభిప్రాయం మేర కు ప్రభుత్వం 7 వేల రూపాయలు గా నిర్ణయించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. వేలంలో పాల్గొనాలని ఆసక్తి ఉ న్నవారు 10వేల రూపాయలు ధరావత్తు సొమ్ము (ఇఎండి) గా జిల్లా కలెక్టర్ , నల్లగొండ పేరుమీద తీసిన డిడిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్‌ఫ్లోర్‌లో క లెక్టర్ ఛాంబర్ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్ స్వగృహ కౌంటర్‌లో కాని నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం వద్ద రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన రాజీవ్ స్వగృహ కార్యాలయంలోఅందజేయవచ్చని అన్నారు. డిడి అందజేసిన వారికి రసీదు , టోకెన్ నెం బర్ ఇవ్వడం జరుగుతుందని , ధరఖాస్తులో అన్ని వివరాలు పూరి ంచి అందజేయాలని కలెక్టర్ తె లిపారు. 10వేల రూపాయలు డిడి చెల్లించిన వారు జిల్లా కలెక్టర్ కార్యాల యం ఉదయాదిత్య భవన్‌లో మార్చి 14,15,16,17తేదీలలో267 చదరపు గజముల నుండి 150 చ.గల వరకు వివిద విస్తీర్ణంలలో ఉన్న 240 ప్లాట్లకు పారదర్శకంగా నిర్వహించనున్న భౌతిక వేలంలో పాల్గొని ప్లాట్లను స్వతం చేసుకోవచ్చన్నారు.

నల్లగొండ పట్టణానికి సమీపాన ప్రభుత్వం హెచ్‌ఎండిఏ , జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజలకు మంచి ప్లాట్లను ఇవ్వాలన్న రాష్ట్ర ప్ర భుత్వ నిర్ణయానికి అనుకూలంగా రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షిప్‌లో అన్ని సౌకర్యాలు , అనుమతులతో ఎలాంటి చిక్కులు లేని క్లియర్ టైటిల్ గల ప్లాట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నరు. ఆసక్తి ఉన్న ప్రజలు వీటిని ప్రత్యక్ష వేలం ద్వారా సొంతం చేసుకోవచ్చని ఆయన వెళ్లడించారు. రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్ వే లంలో పాల్గొన దలచిన వారు సైట్ సందర్శన చేసి ప్లాట్లను పరిశీలన చేసుకోవచ్చని తెలిపారు. రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షిప్ వేలం వివరాలు https://nalgonda. telangana.gov.in h ttp;/ / au ctions.hmda. gov.in, http;//swagruha. telanga na. go v.in http;//tsiic.gov.in వెబ్‌సైట్‌లలో తెలుసుకోవచ్చని నఅదన రు. మరిన్ని వివరాలకు 9849903267నంబర్‌లో సంప్రదించాలని కోరా రు. కార్యాలయం ఫోన్ నెంబర్ 915433929సయ్యద్ సఫీయుద్దిన్ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు.

రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షిప్‌లో ప్లాట్లకు సంబందించిన లేఅవుట్‌లో బ్లాక్ టాప్ , అంతర్గత రోడ్లు, విద్యుత్,స్ట్రీట్ లైట్స్,త్రాగు నీరు, సీవరేజ్, అవెన్యూ ప్లాంటేషన్ తో పాటు అన్నిసౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. ప్రైవేట్ లేఅవుట్‌లకు భిన్నంగా డిటిసిపి నిబంధనలను అనుసరించి 42 శాతం ప్లా టింగ్ ఏరియా , రహదారులు వుంటాయని అన్నారు. ప్రజలకు ఇదే మంచి అవకాశం అని , అందువల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మూడవ ప్రీ బిడ్ సమావేశానికి హాజరైన పలువురు ప్రజలు, ఆసక్తిదారుల సందేహాలను జిల్లా కలెక్టర్ , హెచ్‌ఎండిఏ రాజీవ్ స్వగృహ అధికారులు నివృత్తి చేశారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , రాజీవ్ స్వ గృహ డైరెక్టర్ సి. బాస్కర్‌రెడ్డి, హెచ్‌ఎండిఏ ఈఈ రమేష్, తహసీల్దార్ భిక్షపతి, సర్వే లాండ్‌రికార్డ్ ఏడిఎం శ్రీనివాసులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News