Monday, January 20, 2025

పార్లమెంట్ స్పెషల్ సెషన్ ప్రకటన జారీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను ఆదివారం వెలువరించింది. ఈ నెల 18 నుంచి 22వ తేదీవరకూ ఐదురోజులు ఉభయ సభలు సమావేశం అవుతాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో చర్చించే అంశాల అజెండా ఏదీ ఇందులో పొందుపర్చలేదు. ఈ ఐదు రోజుల సెషన్‌లో క్వశ్చన్ అవర్ , జీరో అవర్, ప్రైవేటు మెంబర్స్ బిల్లుల ప్రస్తావన ఉండదు. ఈ మేరకు లోక్‌సభ సెక్రెటెరియట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఏకకాల ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు ప్రభుత్వం దేశంలో ప్రగతి పరిస్థితి, జి 20 నిర్వహణ, చంద్రయాన్ 3, ఆదిత్యా ఎల్ 1 వంటి వాటిపై వివరణలు ఇస్తుంది. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లు , ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రతిపాదన వంటి విషయాలను ప్రస్తావించేందుకు వీలుంది. క్వశ్చన్ అవర్, జీరో అవర్‌ల ఎత్తివేత రాజ్యసభలో కూడా వర్తిస్తుందని ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News