Monday, December 23, 2024

చవితి రోజు కొత్త పార్లమెంట్‌లోకి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ కొత్త పార్లమెంట్ గణేష్ చతుర్థి నేపథ్యంలో ఈ నెల 19న కొలువు తీరుతుంది. తొలిసారిగా ఇక్కడి నుంచి సభారంభం జరుగుతుంది. ఎటువంటి అజెండా ప్రకటన లేకుండా ఈ నెల 18 నుంచి 22 వ తేదీవరకూ ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ప్రకటన ఇప్పటికే వెలువడింది. తొలిరోజు అంటే 18న పాత భవనంలోనే సెషన్ ఆరంభమవుతుంది.

కాగా మరుసటి రోజు 19వ తేదీన గణేష్ చతుర్థి సందర్భం చూసుకుని కొత్త పార్లమెంట్‌లోకి స్పెషల్ సెషన్‌ను మారుస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది మే 28వ తేదీన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. కాగా పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఎందుకు ఏర్పాటు చేశారనేది ఉత్కంఠకు దారితీసింది. కాగా శనవారం వెలువరించిన అధికార ప్రకటనలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో క్వశ్చన్ అవర్, జీరో అవర్ , ప్రైవేటు సభ్యుల బిల్లుల ప్రస్తావన ఏదీ ఉండదని తెలిపారు.

జమిలి ఎన్నికల బిల్లు తీసుకువచ్చేందుకు లేదా అత్యంత కీలకమైన నిర్ణయం ప్రభుత్వపరంగా ప్రకటించేందురకు ఈ స్పెషల్ సెషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కాగా ఎంపిలకు ప్రత్యేకించి గ్రూప్ ఫోటో సెషన్ ఉందని కూడా సమాచారం అందింది. దీనితో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే విషయం మరింత రాజకుంది. అయితే కొత్త పార్లమెంట్‌కు మారుతున్నందున ఎంపిల బృందం ఫోటోలకు ఏర్పాట్లు జరిగాయని , దీనికంటే వేరే ప్రత్యేకత ఏదీ లేదని ఎంపిలలో కొందరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News