Friday, December 27, 2024

18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశం సోమవారం ( 18వ తేదీ) నుంచి ఆరంభమవుతుంది. ఐదురోజుల పాటు జరుగుతుంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, పార్లమెంట్ ఘన చరిత్ర విశ్లేషణకు, కొన్ని బిల్లుల ఆమోదానికి ఈ సెషన్ ఉంటుందని, ఇది సాధారణ సెషన్ అని, ప్రత్యేకం ఏదీ లేదని ప్రభుత్వం అజెండా వెలువరించింది. అయితే ఐదు రోజుల సిట్టింగ్ దశలో విస్మయకర అంశాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని భావిస్తున్నారు. సోమవారం నాటి సెషన్ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇది రోటిన్ తంతు అవుతుందని , ఇందులో ఏమి ఉండదని, ప్రభుత్వం తన సొంత అజెండాతోనే ఈ సెషన్‌కు రంగం సిద్ధం చేసుకుందని విపక్షాలు స్పందించాయి. ప్రభుత్వం తనకు ఉన్న అధికార బలంతో కొన్ని అనూహ్య బిల్లులను ప్రవేశపెడుతుందని, అజెండాకు అతీతంగా ఉంటాయని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే ప్రభుత్వానికి ఎటువంటి కొత్త చట్టాలను రూపొందించే అధికారం హక్కు అయినా ఉందని విశ్లేషకులు తెలిపారు.

ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లు
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియలో పలు కీలక మార్పులతో ఇటీవలి వర్షాకాల పార్లమెంట్ సెషన్‌లో రాజ్యసభలో బిల్లు తీసుకువచ్చారు. సిఇసి, ఇసిల నియామకాలను ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకునేందుకు ఈ బిల్లును ఉద్ధేశించారని విమర్శలు తలెత్తాయి. ఇప్పటి సెషన్‌లో ప్రభుత్వం తనకున్న బలంతో ఈ బిల్లును ఆమోదింపచేసుకుంటుందని వెల్లడైంది. ఇంతవరకూ సిఇసి, ఇసిల సేవల విధానాలు , అధికారిక హోదాలు సుప్రీంకోర్టు జడ్జి సర్వీస్ కండిషన్‌తో సమానంగా ఉంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిని ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా కేబినెట్ సెక్రెటరీ స్థాయి సేవల పద్థతికి తీసుకురానుంది.

ఇది ఎన్నికల సంఘం నిర్ణయాత్మక పాత్రధారుల హోదాలను తగ్గించడం అవుతుందని , వారి స్వతంత్రత దెబ్బతింటుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కాగా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఈ సెషన్‌లో ప్రవేశపెడుతారని బిజెపి వర్గాలు తెలియచేస్తున్నాయి. ఈ ఏడాది మే 28న ప్రధాని మోడీ ప్రారంభించిన పార్లమెంట్ కొత్త భవనంలోకి సెషన్ మారుతుందని, తొలిరోజు పాత భవనంలో సమావేశాలు ఆరంభమవుతాయని, మరుసటి రోజు కొత్త భవనంలోకి పార్లమెంట్ వేదిక మారుతుందని వార్తలు వెలువడుతున్నాయి. ముందు స్పెషల్ సెషన్ అని, అజెండా లేదని తెలిపిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆ తరువాత ఇఇ రెగ్యులర్ సెషన్ అని, అజెండా ఖరారు చేశామని పేర్కొంటూ దీనిపై వివరణాత్మక ప్రకటన వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News