Wednesday, January 22, 2025

రామ్ చరణ్-ఉపాసనల ముద్దుల కూతురిపై స్పెషల్ సాంగ్..

- Advertisement -
- Advertisement -

రామ్ చరణ్-ఉపాసనల ముద్దుల కూతురిపై మెగా అభిమానులు స్పెషల్ సాంగ్ ను రూపొందిచారు.
బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ అందించగా మహవీర్ ఎల్లందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను సింగర్ ధనుంజయ్ ఆలపించారు. ఉపాసన విడుదల చేసిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

రామ్ చరణ్-ఉపాసన దంపతులకు గతేడాది జూన్ లో కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురికి క్లింకార అనే పేరును నామకరణం చేశారు ఈ స్టార్ కపుల్స్. అయితే, ఇప్పటివరకు వీరు తమ కూతురి ఫోటోను మాత్రం రివీల్ చేయలేదు.

ఇక, మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంది. బెంగళూరులోని ఫాంహౌస్ లో మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్బంగా దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News