Thursday, January 23, 2025

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బీహార్‌కు ప్రత్యేక హోదా

- Advertisement -
- Advertisement -

ఆర్జేడీ మేనిఫెస్టో విడుదల … తేజస్వియాదవ్ ప్రకటన

పాట్నా : కేంద్రంలో విపక్షం ఇండియా కూటమి అధికారం లోకి వస్తే కోటి ఉద్యోగలు కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వియాదవ్ ప్రకటించారు. అలాగే రూ.500 కే సిలిండర్ దేశ వ్యాప్తంగా అందిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పార్టీ మేనిఫెస్టోను తేజస్వియాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 అంశాలతో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు. ఈ ఆగస్టు 15 తరువాత ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని ఆయన చెప్పారు.

ఇది మేనిఫెస్టో ఆర్జేడీదా ? లేకుంటే ఇండియా కూటమిదా ? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఇది పరివర్తన్ పత్రమని అభివర్ణించారు.అయితే కాంగ్రెస్ పార్టీ 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే కోటి ఉద్యోగాలను రైల్వేల్లో , సాయుధ దళాలతోపాటు ఇతర ప్రభుత్వ రంగాల్లో నియమిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం లోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మరో 70 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

ఇక నిరుపేద కుటుంబాల్లోని సామాన్య మహిళలకు రూ. లక్ష అందిస్తామన్నారు. మహిళా సాధికారత కోసం దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేస్తామన్నారు. ఇక బీహార్ ప్రత్యేక హోదా కోసం రూ. 1.60 లక్షల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ఈ ప్యాకేజీ అని స్పష్టత ఇచ్చారు. ఇక బీహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఒక్కోస్థానానికి రూ. 4 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. బీహార్‌లో పర్యాటక అభివృద్ధి కోసం 5 ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని తేజస్వియాదవ్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News