Monday, December 23, 2024

ఊమెన్ చాందీ కోసం చర్చిలో ప్రత్యేక సమాధి

- Advertisement -
- Advertisement -

కొట్టాయం : కేరళ మాజీ సిఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఊమెన్ చాందీ మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన పార్ధివ దేహానికి అంత్యక్రియల సన్నాహాలు జరుగుతున్నాయి. స్వగ్రామం పుత్తుపల్లిలో ఉన్న సెయింట్ జార్జి చర్చి ప్రాంగణంలో చర్చి పూజారులను సమాధి చేసే ప్రాంతంలో ప్రత్యేక సమాధిని సిద్ధం చేస్తున్నారు. ఊమెన్ చాందీ కుటుంబీకుల కోసం చర్చి శ్మశాన వాటికలో స్థలం ఉన్నా ఆయన కోసం ప్రత్యేక సమాధిని నిర్మిస్తున్నట్టు చర్చి ఫాదర్ డాక్టర్ వర్ఘీస్ వర్ఘీస్ తెలిపారు. ప్రత్యేక సమాధిని కట్టాలని చర్చి కమిటీ నిర్ణయించిందన్నారు.

స్థానిక క్రైస్తవ సమాజానికి, చర్చికి ఆయన చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. చాందీ భౌతిక కాయాన్ని బుధవారం తిరువనంతపురం నుంచి కొట్టాయంకు ఊరేగింపుగా రోడ్డు ద్వారా తీసుకువచ్చారు. ప్రత్యేకంగా తక్కువ ఎత్తులో బస్సును పూలదండలతో అలంకరించి చాందీ చిత్రాలతో అంతిమ యాత్ర వాహనాన్ని తయారు చేశారు. కొట్టాయం లోని తిరునక్కర గ్రౌండ్‌లో ప్రజల సందర్శన కోసం భౌతిక కాయాన్ని ఉంచారు. తరువాత స్వగ్రామం పుత్తుపల్లికి తరలిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News