Tuesday, January 21, 2025

తెలుగు రాష్ట్రాలనుండి వారణాసికి ప్రత్యేక టూరిజం ప్యాకేజి

- Advertisement -
- Advertisement -

పర్యాటక ప్రియులకు శుభవార్త
స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐ.ఆర్.సి.టి.సి
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి నేరుగా వారణాసికి
అందుబాటులో టిక్కెట్టు ధరలు

Special tourism package from Telugu states to Varanasi

మన తెలంగాణ/హైదరాబాద్: పర్యాటక ప్రియులకు, కాశీకి వెళ్లాలనుకునే భక్తులకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి నేరుగా వారణాసికి ప్రయాణించేందుకు భారత రైల్వే ఆహార సరఫరా,  పర్యాటక (ఐ.ఆర్.సి.టి.సి) సంస్థ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ’మహాలయ పిండ దాన్’ పేరుతో వారణాసి, ప్రయాగ్ సంగం, గయ వంటి ప్రాంతాలు కవర్ అయ్యేలా 5 రాత్రులు., అనగా 6 రోజులకు ఈ ప్యాకేజీని అందిస్తోంది. 2022 సెప్టెంబర్ 15న ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వాసులు ఈ వారణాసి టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభం కానున్న ఈ టూర్ లో స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.14,485 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.18,785. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం, హోటల్‌లో బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ మొదలైన వసతులన్నీ కవర్ అవుతాయి.

ప్రయాణ ప్రణాళిక:

మొదటి రోజు తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్ లో రైలు బయల్దేరి, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌ల మీదుగా ప్రయాణం చేసి రెండో రోజు వారణాసికి చేరుకంటుంది. గంగా నదిలో స్నానాలు, సైట్‌సీయింగ్ తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం కాశీ విశ్వనాథ, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి, కాళ భైరవ ఆలయాల సందర్శన ఉంటుంది. ఆ రోజు సాయంత్రం సంధ్యా హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఆ రాత్రికి వారణాసిలోనే బస చేయాలి. యాత్రలో మూడో రోజు ఉదయం వారణాసి నుంచి బయల్దేరి ఇరవై నాలుగ్గంటల పాటు ప్రయాణం చేసి, నాలుగో రోజు ప్రయాగ్ రాజ్ చేరుకుంటారు. త్రివేణి సంగమంలో స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆనంద్ భవన్, హనుమంతుని ఆలయం, అలోపి శక్తి పీఠాలను దర్శించుకుంటారు. తదనంతరం శృంగవెన్ పూర్ కి ప్రయాణమవుతారు. అక్కడ రామాయణ కాలానికి సంబంధించిన ప్రాంతాలను పర్యాటకులు చూడవచ్చు. అక్కడినుంచి బయల్దేరి ఐదో రోజు గయ చేరుకుంటారు. అక్కడ విష్ణుపాద ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం, పర్యాటకులకు అవసరార్థం పిండ ప్రదాన కార్యక్రమాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అనంతరం పర్యాటకులు బోధగయకు బయల్దేరతారు. బోదగయ సందర్శనం తరువాత గయ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడల మీదుహా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పర్యాటకులు చేరకోవడంతో టూర్ ముగుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News