ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే చాలా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా కర్ణాటకలోని ఓ ముఖ్య పట్టణానికి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోని అర్సికరే పట్టణానికి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 20వ తేదీ నుంచి – 28వ తేదీ మధ్య కాలంలో ట్రైన్ నంబర్ 07231 సికింద్రాబాద్‌లో రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్సికరేకు అదే రాత్రి ఒంటి గంటకు చేరుకుంటుంది.
మరొకటి (07232) అర్సికరే నుంచి రాత్రి 2 గంటలకు బయల్దేరి ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూల్, అనంతరపురం, ధర్మవరం, హిందూ పురం, ఎలహంక, చిక్బవనూర్, తుమకూరు స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ ట్రైన్‌లో ఎసి 2, ఎసి 3, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలుంటాయి.