Friday, December 20, 2024

18వ తేదీ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు

- Advertisement -
- Advertisement -

Special train to Tirupati from 18th

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే వారాంతంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వారాంతంలో తిరుపతికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజుల్లో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సిఆర్) ఏప్రిల్ 18వ తేదీన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనుంది. సికింద్రాబాద్ నుంచి ఏప్రిల్ 18వ తేదీన 07588 నెంబర్ గల రైలు సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, చిత్తాపూర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు ఎసి టూ టైర్, ఎసి త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఈ నెల 17,18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి…

ప్రయాణికుల డిమాండ్ మేరకు ఈ నెల 17,18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 17వ తేదీన మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక రైలు (07185), సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వరకు 07188 చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు (07646) ప్రత్యేక రైలు నడుస్తాయని అధికారులు తెలిపారు. 18వ తేదీన శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ప్రత్యేక రైలు (07645) ను నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News