Saturday, November 2, 2024

కాచిగూడ – కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి…

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా పండుగ నేపథ్యంలో కాచిగూడ టు కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించగా అవి కూడా ప్రయాణికులతో ఫుల్‌గా నిండిపోయాయి. దీంతో ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు కాచిగూడ- టు కాకినాడ టౌన్ మధ్య అక్టోబర్ 19, 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు (07653) రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు ఈ రైలు కాకినాడకు చేరుకుంటుంది.

తిరుగు మార్గంలో అక్టోబర్ 20, 27 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి ప్రత్యేక రైలు (07654) సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. కాగా ఆయా రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఆయా రైళ్లలో ఫస్ట్ ఎసి, 2 టైర్ ఎసి, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News