Friday, December 20, 2024

సికింద్రాబాద్- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. రైలు నెం 07071 (సికింద్రాబాద్-కాకినాడ టౌన్) సెప్టెంబర్ 2వ తేదీన సికింద్రాబాద్ నుండి రాత్రి 9:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నంబర్ 07072 (కాకినాడ టౌన్-సికింద్రాబాద్) సెప్టెంబర్ 03న కాకినాడ టౌన్ నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, మౌలా-అలీ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో AC ఫస్ట్ క్లాస్, 2A, 3A, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News