ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ ముజఫర్‌పూర్ మధ్య వీక్లీ స్పెషల్ ట్రేన్ప్ నడుపుతోంది. ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షణ మధ్య రైల్వే తెలిపింది. రైలు నెం. 05293 ముజఫర్‌పూర్ సికింద్రాబాద్ రైలు ముజఫర్‌పూర్‌లో ప్రతి మంగళవారం ఉదయం 10.45 గం.లకు బయలు దేరి మరుసటి రోజు బుధవారం రాత్రి 7.50 గం.లకు సికిందరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సెప్టెంబర్ 24వ తేదీ వరకు నడుస్తుంది. అదేవిధంగా ఈ నెల 18 నుండి ప్రతి గురువారం రైలు నెం. 05294 సికింద్రాబాద్
ముజఫర్‌పూర్ ఉదయం 3.55 గం.లకు సికింద్రాబాద్ లో బయలు దేరి మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం 4.30 గం.లకు ముజఫర్‌పూర్ చేరుకుంటుంది. మొత్తం 22 రైళ్ళు ఈ రెండు నగరాల మధ్య నడువనున్నాయి. ఈ రైళ్లు హాజిపూర్, పాటలిపిత్ర, దనపూర్, ఆరా జం. బుక్సర్ , ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్, చియోకి, సాత్న, కత్ని, జబల్‌పూర్, ఇటార్సి, నాగ్‌పూర్, బల్హార్షా, సిర్‌పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, పెద్దపల్లి, ఖాజీపేట్ స్టేషన్‌లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఎసి మొదటి తరగతి, ఎసి టు టైర్, ఎసి త్రీ టైర్, ఎసి త్రీ టైర్ ఎకానమి తరగతి బోగీలు ఉంటాయి.