Friday, December 20, 2024

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. 8 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి నుంచి కొల్లాంకు రైలు బయల్దేరనుండగా ఈ నెల 24, డిసెంబర్ 1న కొల్లాం – మౌలాలికి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఈ నెల 18, 25వ తేదీల్లోనూ మచిలీపట్నం – కొల్లాంకు రైలు వెళ్లనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొల్లాం – మచిలీపట్నం తిరుగు ప్రయాణానికి ఈ నెల 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నపడనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ మౌలాలీలో ఈ నెల 23, 30న 07141 నంబరు గల రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాత రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడప, రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్ 2వ తేదీల్లో 07142 నంబర్ గల రైలు కొల్లాంలో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి, అదే రోజు రాత్రి 11 గంటలకు కడపకు, తర్వాతరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మౌలాలీకి చేరుకుంటుంది.కడప మీదుగా కేరళలోని కొట్టాయం, కొల్లాంలకు ఈ నెలలోనే 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నాయి.

ఈ నెల 21, 28 తేదీల్లో 07133 నంబరు గల రైలు కాచిగూడలో మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 12.10 గంటలకు కడపకు చేరుకుంటుంది. తర్వాత రోజు సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07134 గల రైలు ఈనెల 22, 29 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కొట్టాయం నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కడపకు, రాత్రి 11:40 నిమిషాలకు కాచిగూడకు చేరుకుంటుంది. హైదరాబాద్‌లో ఈ నెలలో 19, 26వ తేదీల్లో 07135 నంబరు గల రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి రాత్రి 10.25 గంటలకు కడపకు, మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07136 గల రైలు ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.50 గంటలకు కడపకు, రాత్రి 11 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News