Friday, January 17, 2025

వారికి తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

లక్నో: అయోధ్యలో మంగళవారం నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 7 నుంచి 11.30, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు దర్శన సమయం ఉంటుంది. ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని రామజన్మభూమి ట్రస్టు వెల్లడించింది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో దర్శనం, హారతి పాసులు ఇస్తామని పేర్కొంది. శ్రీరామజన్మభూమి తీర్థ ట్రస్టు వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ సౌలభ్యం కూడా కల్పించింది.

తెలంగాణ నుంచి అయోధ్యకు బిజెపి ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఈ నెల 29 నుంచి అయోధ్యకు ఆస్థా రైళ్లు నడుపుతోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అయోధ్యకు భక్తులను తరలిస్తున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి అవకాశం ఇచ్చారు. అయోధ్యకు వెళ్లే ఆస్థా రైళ్ల షెడ్యూల్‌ను బిజెపి ప్రకటించింది. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

ప్రత్యేక రైళ్లు:

తేదీ                                       స్థలం
జనవరి 29                           సికింద్రాబాద్ నుంచి అయోధ్య
జనవరి 30                          వరంగల్ నుంచి అయోధ్య
జనవరి 31                           హైదరాబాద్ నుంచి అయోధ్య
ఫిబ్రవరి 1                             కరీంనగర్ నుంచి అయోధ్య
ఫిబ్రవరి 2                             మల్కాజ్‌గిరి నుంచి అయోధ్య
ఫిబ్రవరి 3                             ఖమ్మం నుంచి అయోధ్య
ఫిబ్రవరి5                               పెద్దపల్లి నుంచి అయోధ్య
ఫిబ్రవరి7                               నిజామాబాద్ నుంచి అయోధ్య

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News