Sunday, January 19, 2025

దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

Special trains for Dussehra festival

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీన సికింద్రాబాద్ నుంచి సంత్రాగచికి (భువనేశ్వర్-, కటక్ మీదుగా) (07645) రైళ్లను నడపనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 1న సంత్రాగచి నుంచి సికింద్రాబాద్‌కు (07646), అక్టోబర్ 2వ తేదీన సికింద్రాబాద్ టు -షాలిమార్ రైలు (07741), అక్టోబర్ 3వ తేదీన షాలిమార్ టు -సికింద్రాబాద్ రైలు(07742), అక్టోబర్ 1, 8 తేదీల్లో నాందేడ్- టు బర్హంపూర్ రైలు (07431), అక్టోబర్ 1, 8 తేదీల్లో త్రివేండ్రం- టు టాటానగర్ రైలు (06192), అక్టోబర్ 2, 9 తేదీల్లో బర్హంపూర్- టు నాందేడ్ ప్రత్యేక రైలు( 07432), అక్టోబర్ 4, 11 తేదీల్లో టాటానగర్ టు -త్రివేండ్రం ప్రత్యేక రైళ్లు (06191) బయలుదేరుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

రైళ్ల సమయంలో మార్పులు, చేర్పులు
కొన్ని రైళ్ల సమయంలో మార్పులు, చేర్పులు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొన్ని రైళ్లు బయలుదేరే సమయం, ఆయా స్టేషన్లకు చేరుకునే సమయాన్ని సవరించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు వారు వెళ్లాల్సిన రైళ్ల సమయాల్లో మార్పు సమాచారాన్ని రైల్వే విచారణ నంబర్ 139 ద్వారా కానీ, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్(ఎన్‌టిఈఎస్) వెబ్‌సైట్ లేదా ఐఆర్‌సిటిసి లేదా రైల్వే స్టేషన్లలోని విచారణ కౌంటర్‌లలో తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News