Sunday, January 19, 2025

హోలీ పండుగ నేపథ్యంలో 18 ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

హోలీ పండుగ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. హోలీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. మొత్తం 18 ప్రత్యేక రైళ్లు ఈ సేవలు అందించనున్నాయి. మార్చి 16వ తేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ టు గోమతి నగర్, గోమతి నగర్ – టు సికింద్రాబాద్, హైదరాబాద్ – టు పాట్నా, పాట్నా -టు హైదరాబాద్, పాట్నా -టు రక్సాల్, రక్సాల్ – టు కాచిగూడ, కాచిగూడ -టు రక్సాల్, సంత్రగాచి టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ -టు షాలిమార్, షాలిమార్ -టు సికింద్రాబాద్, కాచిగూడ టు- లాల్ ఘర్, లాల్ ఘర్ -టు కాచిగూడ, సికింద్రాబాద్ టు- దర్బాంగా, దర్బాంగా టు- సికింద్రాబాద్‌కు ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News