Monday, December 23, 2024

పూరీ యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పూరీ యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీల మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. టికెట్ రిజర్వేషన్ సదుపాయం ఇప్పటికే ప్రారంభమైందని, ఎసి, నాన్ ఎసి సదుపాయం కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. ఆన్ రిజర్వుడు ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News