హైదరాబాద్ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ రైలును గురువారం రాత్రి 9.30 గంటలకు నడిపించనుండగా, దీంతో పాటు సికింద్రాబాద్ – కాకినాడ టౌన్‌కు ఆ మరునాడు శుక్రవారం ( రాత్రి 9 గంటలకు), అలాగే కాకినాడ టౌన్ నుండి వికారాబాద్‌కు శనివారం రాత్రి 8 గంటలకు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైళ్లతో జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, గుడివాడ,కైకలూరు,
ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. ఈ ట్రైన్‌కు జనరల్ బోగీలతో పాటు ఏసి 2 టైర్, ఏసి 3 టైర్ బోగీలను కలుపుతున్నట్లు వెల్లడించింది. కాగా కాకినాడ టౌన్ – వికారాబాద్ స్పెషల్ ట్రైన్ ఏపిలోని సామర్లకోట, రాజమండ్రి మీదుగా కౌకలూరు , గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్ల మీదుగా పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లొండ, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లకు చేరుకోనుందని తెలిపింది.
నేడు ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు
కాగా హైదరాబాద్‌లోని లింగంపల్లి – ఫలక్‌నుమా , సికింద్రాబాద్ – ఫలక్‌నుమా రైళ్లను నేడు తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మార్గాల్లో మొత్తం నాలుగు ( ట్రైన్ నెం 47182,47183,47161,47162) రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలోతెలిపింది.