Thursday, January 23, 2025

సంక్రాంతి పండుగకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే

Quarantine must for those coming from TS to Delhi

మనతెలంగాణ/హైదరాబాద్:  సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ రద్దీగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా తాజాగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. మంగళవారం రాత్రి 9గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనున్న ఈ సువిధ ప్రత్యేక రైలు (నెం 82725) మరుసటి రోజు ఉదయం 9.50గంటలకు విశాఖ చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలులో సెకండ్ ఏసి, థర్డ్ ఏసితో పాటు స్లీపర్, సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైలు సేవలు పూర్తిగా రిజర్వేషన్ చేయించుకున్న వారికేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News