Monday, December 23, 2024

కాచిగూడ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కాచిగూడ నుండి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాచిగూడ నుండి కొల్లాంకు ఈ నెల 18,25 తేదీలతో పాటు జనవరి నెల 1,8,15 తేదీలలో సోమవారం రాత్రి 11.45కి బయలుదేరి బుధవారం ఉదయం 5.30కు చేరుకుంటుందని తెలిపింది. అలాగే తిరుగు ప్రయాణంలోనూ కొల్లాం నుండి కాచిగూడకు ఈ నెల 20,27 తేదీలలోనూ, అలాగే జనవరి నెల 3,10, 17 తేదీలలో బుధవారం ఉదయం 10.45కి బయలుదేరి గురువారం అర్ధరాత్రికి చేరుకుంటుందని తెలిపింది.

అయ్యప్ప స్వాముల కోరిక మేరకు హైదరాబాద్ ఉందానగర్, షాద్ నగర్ , జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, శ్రీరాంనగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపర్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు తదితర స్టేషన్లను ఆగుతుందని వెల్లడించింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని దమ రైల్వే వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News