Friday, December 20, 2024

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

Special trains on various routes

 

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖ టు -సికింద్రాబాద్ (08579/08580) స్పెషల్ రైలును ఈనెల 24 నుంచి సెప్టెబర్ 28 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు ప్రతి గురువారం సాయంత్రం 7.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖ చేరుకోనుంది. విశాఖపట్నం- టు మహబూబ్‌నగర్ (08585/08586) ప్రత్యేక రైలు ఈనెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈనెల 24 నుంచి 28 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖపట్నం- టు తిరుపతి (08583/08584) ప్రత్యేక రైలు ఈనెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుందని సిపిఆర్‌ఓ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News