అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే
డిసెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ నుంచి ప్రారంభం
నేటి రిజర్వేషన్‌లు ప్రారంభం
హైదరాబాద్: భక్తుల విజ్ఞప్తి మేరకు శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ -టు కొల్లాం మధ్య అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. డిసెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ నుంచి కొల్లాం స్టేషన్‌కు 07109 నంబర్ గల రైలు బయలుదేరుతుందని, కొల్లాం నుంచి సికింద్రాబాద్‌కు డిసెంబర్ 19వ తేదీన 07110 నంబర్ రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. 07109 నంబర్ గల రైలుకు రిజర్వేషన్ల ప్రక్రియ డిసెంబర్ 10న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పడి, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్చెరి, తిరువళ్ల, చెంగనూరు, మావలికర, కయాంకులం స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి.