Saturday, February 22, 2025

పవన్ బర్త్ డేకి స్పెషల్ ట్రీట్

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో మాస్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. దర్శకుడు హరీష్ శంకర్‌తో గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే అతి తక్కువ సమయంలోనే చాలా షూటింగ్‌ని హరీష్ పూర్తి చేసి ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ సినిమాపై తాజాగా నిర్మాతలు ఆసక్తికరమైన అప్డేట్ అందించారు.

అతి త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని, పవన్ డేట్స్ ఇస్తే డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసేస్తామని వారు తెలిపారు. అలాగే ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఒక స్పెషల్ ట్రీట్ ని అందిస్తున్నట్టుగా మేకర్స్ తెలియజేశారు. దీంతో పవన్ బర్త్ డే కి క్రేజీ ట్రీట్ రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News