Monday, December 23, 2024

తొలి ఏకాదశి పర్వదినం హరివర్ధన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

శామీర్‌పేట: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం శామీర్‌పేట మండలం అలియా బాద్ గ్రామ పరిధిలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వేదపండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, అలియా బాద్ గ్రామ ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యులు బండి రాంరెడ్డి, ముద్దం సుధాకర్ రెడ్డి, మాజీ యంపీపీ పల్లె సీతారాములు గౌడ్, తూంకుంట మున్సిపల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ గౌడ్, బాల్ రెడ్డి, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News