Saturday, November 23, 2024

యాదాద్రిలో శివుడికి ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం యా దాద్రి కొండపైన కొలువుదీరిన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో శివుడికి అభిషేక పూజలు, రుద్రహోమ పూజలు శాస్రోక్తంగా పండితులు నిర్వహించగా భక్తులు, స్థానికులు పాల్గొని శివ దర్శనం చేసుకున్నారు. ఉపవాసాలతో ఉన్న భక్తులు శివ దర్శనము, ప్రత్యేక పూజలు చేసి తమ మెక్కుబడులను చెల్లించుకున్నారు.

ఉదయం శివాలయంలో అర్చకులు అభిషేక పూజలు, శివాలయంలో జరుగు నిత్యపూజలో భాగంగా ఆలయ ఆవరణలో రుద్రహోమ పూజలను అర్చకులు, పండితులు శాస్త్రానుసారం నిర్వహించగా, సాయంత్రం శివాలయ ఆవరణలో మేళతాళాల మధ్య వేదమంత్రోచ్ఛరణ గావిస్త్తూ శివుడిని ఊరేగించగా భక్తులు దర్శించుకున్నారు.

ఆలయ నిత్యపూజలో భక్తులు..
శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న భక్తులు శ్రీవారి క్షేత్రంలో సోమవారం జరిగిన అభిషేకం, అర్చన, సువర్ణ పుష్పార్చన, నిత్యకల్యాణం, వెండి జోడి సేవ, వత్రపూజలలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భా గంగా సోమవారం రూ.31,61,116 ఆదాయం వచ్చినట్టు ఆల య అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.12, 17,420, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.4,00,000, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,77,200, వీఐపీ దర్శనం ద్వారా రూ .3,75,000, బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,90,600, వ్రతపూజల ద్వారా రూ.40,000తో పాటు పలు శాఖలు, పాతగుట్ట ఆలయం నుండి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్, తెలంగాణ ప్రభుత్వ విప్ ప్రభాకర్‌రావు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్, ప్రభాకర్‌రావుకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News