డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (NABARD) కాంట్రాక్ట్ విధానంలో పలు రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్ మెంట్ (NABARD) లో కాంట్రాక్ట్ విధానంలో స్పెషలిస్ట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
అయింది. ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల సంఖ్య: 5
ఖాళీల వివరాలు: సీఐఎస్‌ఓ- 01, క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్-మిటిగేషన్- 01, క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్-అడాప్షన్- 01, కంటెంట్ రైటర్- 01, గ్రాఫిక్ డిజైనర్- 01
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 మార్చి 23
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 6
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850గా, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్ చార్జెస్ రూ.150 గా ఉంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nabard.org
మరిన్ని వివరాలకు https://www.nabard.org అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయండి.