Sunday, December 22, 2024

సెప్టెంబర్ 2వ తేదీ నాటికి హైదరాబాద్ మెట్రోకు ప్రత్యేకత రాబోతుంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులిచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేయనున్నామని, ఐదు టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు. శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామన్నారు. దానికి రూ.15 వేల కోట్ల వరకు ఖర్చు కానుందని చెప్పారు. మూసీ నదిపై స్కైవేను నిర్మిస్తామని కెటిఆర్ తెలిపారు. కరోనా వల్ల మూసీ సుందరీకరణను అనుకున్నంత వేగంగా చేయలేకపోయామని ఆయన వెల్లడించారు. రెండున్నర ఏళ్లలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోను పూర్తిచేస్తామని కెటిఆర్ వెల్లడించారు. బిహెచ్‌ఈఎల్ నుంచి కందుకూరు ఫార్మాసిటీ వరకు మెట్రో రైలు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దేశంలోని ఏ మెట్రో నగరానికి లేని ప్రత్యేకత సెప్టెంబర్ 2వ తేదీ నాటికి హైదరాబాద్‌కు రాబోతుందని కెటిఆర్ వెల్లడించారు. అందులో మొదటి ఫలితాలు నేడు అందుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News