Monday, December 23, 2024

మొక్కలు నాటడానికి ఏర్పాట్లు వేగవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

వరంగల్: మొక్కలు నాటడానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా పరిధిలోని మడికొండ, వడ్డేపల్లి ప్రాంతాలలో బల్దియా నిర్వహిస్తున్న నర్సరీలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెస్ట్ సిటీ మడికొండ, సూర్య కుటీర్ లో గల 7 నర్సరీ లలో పర్యటించి పెంచబడుతున్న మొక్కలను కమిషనర్ పరిశీలించారు. ఇక్కడ ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని సిహెచ్‌ఓను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ వేగంగా ఎదిగే మొక్కలను పెంచాలని, సూర్య కుటీర్ లో ప్రాంతంలో గల నర్సరీ కి కాంపౌండ్ వాల్ నిర్మించాలని, జీవామృతం తయారీ పై ఫారెస్ట్ వారి సహకారం తో సిబ్బందికి శిక్షణను ఇప్పించాలని, ప్రతి ఇంటికి మొక్కలు అందజేసి పెంచేలా సరిపోయే విధంగా మొక్కలను పెంచాలని నర్సరీలో పెంచబడు మొక్కలను సంరక్షించాలని, వచ్చే సంవత్సరం నిర్వహించనున్న హరితహారం కార్యక్రమానికి ఇప్ప టినుండే సన్నద్ధంగా ఉండాలని, మొక్కలు ఎదగడానికి అవసరమైన నీటిని అందజేస్తూ నీడ తెరల (షేడ్ నెట్స్)ను సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని, బల్దియా అవసరాల నిమిత్తం పట్టణ ప్రగతి, అవెన్యూ, మీడియన్ అవసరాల కోసం మొక్కలు పెంచేలా చూడాలని కమిషనర్ అన్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులు స్వీకరించిన నేపధ్యంలో బల్దియా పరిధి లోని నయీం నగర్, తెలంగాణ చౌరస్తా, ప్రశాంత్ నగర్, హంటర్ రోడ్ ఏరియాల్లో పర్యటించిన కమీషనర్ అట్టి ప్రాంతాలను పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News