నాగర్‌కర్నూల్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జి ల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో పి ఆర్‌ఎల్‌ఐ, మొదటి ఫేజ్, రెండవ ఫేజ్, కల్వకుర్తి, మార్కండేయ రిజర్వాయర్, కాలువల భూ సేకరణ సమస్యలు, ఇతర సమస్యలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జులై చివరి వారం నాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు మోటర్లు ప్రారంభించి నీరు ఎత్తిపోయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించినందున అందుకు అనుగుణంగా పనులు శరవేగంగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. అందువల్ల పాలమూ రు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి రిజర్వాయర్లు, ప్రధాన కాలువ నిర్మాణానికి ప్యాకేజి 1 ను ంచి ప్యాకేజ్ 12 వరకు భూ సేకరణకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయో చెప్పాలని సూచించారు. మొత్తం 11861.05 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 11770.29 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగిందన్నారు. కేవల ం 90.15 ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపా రు. సేకరించిన స్థలంకు సంబంధించి చాలా వా టికి పేమెంట్ పూర్తి చేయగా మరికొంత స్థలాలకు పిఎన్ స్టేజిలో, పిడి స్టేజిలో, అవార్డు స్టేజ్‌లో ఉన్నాయన్నారు.
ఇప్పటికే భూ సేకరణ పూర్తి చేసి ఇరిగేషన్ శాఖకు అప్పగించిన తర్వాత సైతం ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, రెవెన్యూ అధికారుల ద్వారా సమస్య పరిష్కరించడ ం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా అప్పర్ ప్లాట్‌కు సంబంధించిన రెండవ ఫేజ్‌కు సంబంధించిన, మార్కండేయ రిజర్వాయర్ భూ సేకరణపై సై తం మాట్లాడారు. మార్కండేయ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం విషయంలో త్వరలో నే ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఇరిగేష న్ ఎస్‌ఈ విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నార్లాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి పది ఎకరాల భూ సేకరణ పెండింగ్ ఉందని రైతులకు అవార్డ్ పాస్ చేసి స్థలాన్ని అప్పగించాలని కోరారు. అదే వి ధంగా సేకరించిన స్థలాన్ని అప్పగించాలని కోరా రు. అదే విధంగా సేకరించిన స్థలంకు సంబంధిం చి కొన్ని ఎకరాలకు మ్యుటేషన్ చేసి స్థలాన్ని ప్ర భుత్వం పేరున మార్చాలని కోరారు. స్పందించిన కలెక్టర్ వెంటనే మ్యుటేషన్ పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ అధికారి మోతిలాల్‌కు సూచించారు. భూ సేకరణకు సంబంధించి ఏ సమస్య ఉన్న త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడైనా భూ సర్వే చేయాల్సి ఉంటే వాటిని సైతం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, కల్వకుర్తి ఆర్డిఓ రాజేష్ కుమార్, ఎస్‌ఈ 1 ఇరిగేషన్ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎస్‌ఈ 2 ఎస్‌ఎన్ రెడ్డి, ఇరిగేషన్ కార్యనిర్వహక ఇంజనీర్లు పార్థసారధి, బి. సంజీవ్ రావు, జై. శ్రీనివాస్ రెడ్డి, ఆర్. రవీందర్, ఉప కార్య నిర్వాహక ఇంజనీర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.