Monday, December 23, 2024

ఇంటింటి ఓటరు సర్వేను వేగవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్: ఇంటింటి ఓటరు సర్వేను వేగవంతం చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బిఎల్‌ఓ సూపర్వైజర్లు, బిల్ కలెక్టర్ల తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూలు ప్రకారం ఇంటింటి ఓటరు సర్వేను పూర్తి చేయడం, ఒక ఇంటిలో ఆరుగురు కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే వారిని గుర్తించి సర్వే నిర్వహించడం,వాదనలు (క్లైమ్స్), అభ్యంతరాలను పరిష్కరించడం పూర్తి చేయాల్సిన అవసరం ఉందని,

ఇంటింటి ఓటరు సర్వేను ఈనెల 23 లోగా పూర్తి చేయాలని,ఫారం -6,7,8 సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసే క్రమంలో సంజాయిషీ తీసుకోవాలని, నూతనంగా ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించి అక్టోబర్ 1 లోగా అర్హులను ఓటర్లుగా నమోదు చేయించాలని, ఎన్నికల కమిషన్ జారీ చేసిన చెక్ లిస్ట్ (గుర్తింపు జాబితా) యందు వాస్తవ సమాచారాన్ని నమోదు చేయాలని కమీషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, డిడబ్లూఓ శారద, వరంగల్ డిఎంహెచ్ ఓ.డా.వెంకటరమణ, ఏసిపి బోనాల కిషన్, సిడిపిఓ విశ్వజ, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, తహశీల్దార్ ఫణి కుమార్, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News