Saturday, December 21, 2024

ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు దూకుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం రాత్రి ఓ బస్సు అదుపు తప్పి బ్రిడ్జి కిందికి పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 18 మంది గాయపడ్డారు. అత్యంత వేగంగా వెళ్లుతున్న ఈ బస్సు గజియాబాద్ రోడ్‌వేస్‌కు చెందినది అని అక్కడున్న సిసిటీవీ ఫుటేజ్‌లతో వెల్లడైంది. బస్సు ఉన్నట్లుండి ఎడమవైపు తిరిగి కింద ఉన్న గుంతలో పడింది. మధ్యలో ఉన్న కటౌట్ పూర్తిగా విరిగిపోయింది. బారికేడ్లను చీల్చుకుంటూ ఈ బస్సు కిందపడిన వైనం ఫుటేజ్‌లతో స్పష్టం అయింది. డ్రైవర్ నిద్రపోతూ బస్సు నడిపినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రమాదానికి కారణాలు ఏమిటనేది పూర్తిగా నిర్థారణ కాలేదు. బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడైంది. ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్ వే 14 లేన్ల రోడ్డుగా ఉంది. 96 కిలోమీటర్ల ఈ రాదారి నిర్మాణానికి రూ 8000 కోట్ల వరకూ ఖర్చు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News