Thursday, January 23, 2025

కేరళ గవర్నర్ కాన్వాయ్‌లోకి స్పీడ్ కారు

- Advertisement -
- Advertisement -

నోయిడా : ఉత్తరప్రదేశ్‌లో స్పీడుగా వెళ్లుతున్న కారు ఒకటి కేరళ గవర్నరు అరిఫ్ మెహమ్మద్ ఖాన్ కాన్వాయ్‌ లోపలికి చొచ్చుకుని వెళ్లింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నోయిడాలో ఓ కార్యక్రమం నుంచి గవర్నర్ ఢిల్లీకి వెళ్లుతూ ఉండగా కారుదూసుకురావడం తీవ్రస్థాయి భద్రతా ఉల్లంఘనకు దారితీసింది. గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకువచ్చిన కారులోని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

వీరు తాగి ఉన్నట్లు గుర్తించారు. రెండుసార్లు ఈ స్కోర్పియో కారు రూల్స్‌కు విరుద్ధంగా విఐపి కాన్వాయ్‌లోకి దూసుకువెళ్లడం , పోలీసుల నుంచి వెనువెంటనే తీవ్రస్పందనకు దారితీసింది. అరెస్టు చేసిన వారిని గౌరవ్ సోలంకి, మోనూ కుమార్‌లుగా గుర్తించారు. వీరిది గజయాబాద్ అని తేలింది. కేరళ గవర్నర్ నోయిడాలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News