Sunday, December 22, 2024

కారును ఢీకొట్టిన లారీ… వధువు, వరుడితో సహా ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : పెళ్లి బృందంతో వెళ్తున్న కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మృతుల్లో అప్పడే పెళ్లైన నవవధువు, వరుడు ఉన్నారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఛత్తీస్‌గఢ్ లోని జాంజ్‌గిర్‌చంపా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బలోడా గ్రామానికి చెందిన శుభమ్ సోనీకి శివనారాయణ్ టౌన్‌కు చెందిన మహిళతో శనివారం రాత్రి పెళ్లి జరిగింది. నూతన వధూవరులు, మరో ముగ్గురు కారులో వరుడి గ్రామమైన బలోడాకు బయలుదేరారు.

ఆదివారం తెల్లవారు జామున ముల్ముల పోలీస్ స్టేషన్ పరిధి లోని పకారియా ఝలన్ గ్రామ సమీపంలో వారు ప్రయాణించిన కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నూతన వధూవరులతోపాటు కారును నడుపుతున్న వరుడి తండ్రి ఓం ప్రకాశ్ సోనీ, మరో ఇద్దరు మరణించారు. ప్రమాదం తెలుసుకున్న పోలీస్‌లు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తరువాత లారీ విడిచిపెట్టి పరారైన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News