Saturday, December 21, 2024

నాణ్యతతో రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం గడియారం సెంటర్ నుంచి పెద్దబండ వరకూ జరుగుతున్న రోడ్డు వైండింగ్ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.

డ్రైనేజీ కోసం మోరీల నిర్మాణంతో పాటు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పనులు పూర్తి చేయాలని సూచించారు. గడియారం సెంటర్ నుంచి పెద్ద బండ వరకూ ఎమ్మెల్యే కాలినడకన నడిచి అక్కడక్కడ ఆగి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, ఆలకుంట్ల రాజేశ్వరి మోహాన్బాబు, జేరిపోతుల అశ్విని భాస్కర్గౌడ్, సమి, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News