Sunday, December 22, 2024

కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం కావాలి

- Advertisement -
- Advertisement -
  • పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
  • హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్

మెదక్: కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం కావాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. కోర్టులకు వెళితే సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కక్షిదారుల్లో కలిగేలా న్యాయ వ్యవస్థపని చేయాలని హితవు పలికారు. శనివారం మెదక్ కోర్టు సముదాయంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మూడవ అంతస్తు భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జీలు జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ సంతోష్‌రెడ్డి, మెదక్ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి లక్ష్మిశారద, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పి రోహిణి ప్రియదర్శిని, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జెన్నారెడ్డిలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మాట్లాడుతూ కేసులు త్వరితగతిన పరిష్కారం కావాలని, 25-30 యేళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉంచడం మంచిది కాదని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలకనుగుణంగా అందరు నడుచుకొని పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు.

న్యాయ వ్యవస్థకు బార్-బెంచ్ రెండు చక్రాలాంటివని, రెండు సక్రమంగా పనిచేస్తేనే కేసులు సత్వర పరిష్కారమై కక్షిదారులకు న్యాయం చేకూర్చినవారవుతామన్నారు. మౌలిక వసతులు సక్రమంగా ఉన్నప్పుడే కోర్టుల నిర్వహణ సజావుగా సాగుతుందన్నారు. అందుకోసమే రాష్ట్రంలోని కోర్టులకు బిల్డింగ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడ కోర్టు సముదాయంలో ఉన్న ఆరు కోర్టులకు భవనం సరిపోవడం లేదనే 3వ అంతస్థున నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు జెన్నా రెడ్డి చీఫ్ జస్టిస్ కు వినతి పత్రం అందజేస్తూ మొబైల్ కోర్టును అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు గా అప్ గ్రేడ్ చేయాలని 10 ఎకరాల సువిశాల కోర్టు సముదాయం ఉన్నందున వాంగల్ లో 33 కోట్ల తో చేపడుతున్న మోడల్ కోర్టు సముదాయం మాదిరే ఇక్కడ ఆఫీసర్స్ క్వార్టర్స్, కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మెదక్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసి చర్చి ప్రాశస్తతను పాస్టర్ ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జ నరల్ బివి ప్రసాదరావు, న్యాయమూర్యులు, న్యాయవాదులు, అదన పు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేష్, ఇప్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఆర్డీఓ సాయిరాం, ఏడుపాయల ఈఓ సారా శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News