Friday, December 20, 2024

రాష్ట్రస్థాయికి ఎంపికైన శ్రీనిత

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన రాపాక శ్రీనిత ఇంగ్లీషు లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ విజార్ట్ అండ్ స్టోరీ టెల్లింగ్ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ దేవులపల్లి శ్రీకాంత్ గురువారం విలేకరులకు తెలియచేశారు. ఈ నెల 13 హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో శ్రీనిత పాల్గొంటుందన్నారు.

అంతే కాకుండా దేశిని షణ్ముక ప్రియ జిల్లా స్థాయిలో తృతీయ స్థానం సంపాదించినట్లు తెలిపారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనిత, షణ్ముక ప్రియను ప్రిన్సిపాల్ శ్రీకాంత్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ డా జానీ నాయక్, గైడ్ ఉపాధ్యాయులు గణేశ్, పావని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News