- Advertisement -
న్యూఢిల్లీ: ఉచిత పథకాలు దేశానికి మంచివి కావంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా దానిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తగురీతిలో సమాధానం కూడా ఇచ్చారు. కాగా ఇప్పుడు అదే రీతిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ప్రతిస్పందించారు. ‘‘విద్య, వైద్యంపై చేసే ఖర్చు ఉచితాలు కావు. అవి పేదలకు మేలు చేసేందుకు ఉన్న పథకాలు. విద్య జ్ఞానాన్ని, వైద్యం ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇప్పుడు కొందరు ఉచితాలుండకూడదని అంటున్నారు. దాని గురించి మేము పట్టించుకోము. ఇంతకు మించి మాట్లాడితే అది రాజకీయం అవుతుంది. సుప్రీంకోర్టు సైతం ఇటీవల ఉచితాలు, సంక్షేమ పథకాలకు మధ్య తేడా ఉందని వ్యాఖ్యానించింది ’’ అన్నారు. తన కొలతూర్ నియోజకవర్గంలోని అరుమిగు కపిలేశ్వరర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఈవెంట్ లో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు.
- Advertisement -