Friday, December 20, 2024

దళితుడి పై ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ దాడి

- Advertisement -
- Advertisement -
  • బాధితుడు పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన బిఎస్పి నేతలు
  • దళితులపై దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్ వెంటనే సస్పెండ్ చేయాలి

శంషాబాద్ :- పదిమందికి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారులే సామాన్యులపై దాడి చేస్తే భాధ ఎవరితో చెప్పుకోవాలి. నేను పోలీసును కదా ఏమి చేసినా అడిగేవారు ఉండరని అనుకున్నాడో ఏమో ఓ పోలీసు అధికారి దళిత యువకుడిపై దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చింతల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం… ముచింతల్ గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ (ఎస్పీఎఫ్) జ్ఞానేశ్వర్ (గణేష్) 30వ తేదీన అదే గ్రామానికి చెందిన పవణ్ కళ్యాణ్ అనే దళిత యువకునిపై దాడి చేశాడు. పవణ్ కళ్యాణ్ పదే పదే జ్ఞానేశ్వర్ ఇంటి ముందు నుంచి వెళ్తుంన్నాడని అతని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు.

తన ఇంటి ముందు నుంచి ఎందుకు వెళుతున్నావు ఇక్కడి నుంచి వెళ్తే నీ అంతు చూస్తా అంటూ కులం పేరుతో దూషించాడు. అంతే కాకుండా అతనిపై దాడికి దిగాడు. జ్ఞానేశ్వర్ తో పాటు అతని కుమారుడు వంశీ అతనికి తోడై ఇద్దరు దాడి చేశారు. దీంతో తప్పించుకున్న పవణ్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తల్లి బాలామణి బాబాయ్ రాజుతో చెప్పాడు. అయితే రాజు హుటాహుటిన జ్ఞానేశ్వర్ ను అడిగేందుకు వస్తుండగా పోలీస్ డ్రెస్‌లో కారుతో ఎదురయ్యాడు. దీంతో కారు ఆపాల్సిందిగా రాజు కోరడంతో కారును రాజు పైకి తీసుకొచ్చాడు.

 దీంతో రాజు ఎగిరి కారు బానట్ పై పడి 100 మీటర్ల వరకు వెల్లాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే దాడిలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ శంషాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ పెళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కులం పేరుతో దూషించిన కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్‌ను వెంటనే అరెస్టు చేయాలని బిఎస్పి పార్టీ రాజేంద్రనగర్ అధ్యక్షుడు రాచమల్ల జయసింహ డిమాండ్ దళితులపై దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం బిఎస్పి పార్టీ అధ్యక్షుడు రాచమల్ల జయసింహ డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పోలీసు ఉద్యోగం ఇచ్చింది ప్రజలకు న్యాయం చెయ్యాలని కానీ కొందరు పోలీసులు ఇలాంటి పనులు చేసి వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నారని ఇలాంటి వారితో పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయె అవకాశం ఉంటుందని అన్నారు. కాబట్టి పవణ్ కళ్యాణ్ అతని బాబాయ్ రాజు పై కులం పేరుతో దూషించి దాడి చేసిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ , అతని కుమారుడు వంశీ లపై కేసు నమోదు చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News