Thursday, January 9, 2025

ఎస్‌పిజి డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రత్యేక రక్షణ బృందం(ఎస్‌పిజి) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా బుధవారం తెల్లవారుజామున గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు 61 సంవత్సరాలు. గత కొద్ది నెలలుగా సిన్హా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కేరళ క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన సిన్హా ఎస్‌పిజి డైరెక్టర్‌గా 2016 నుంచి కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయనకు పదవీ పొడిగింపు లభించింది.

ప్రధాన మంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేందుకు 1985లో ఎస్‌పిజి ఏర్పడింది. ఆ తర్వాత ఎస్‌పిజి పరిధిని తగ్గించి ప్రస్తుతం ప్రధాన మంత్రికి మాత్రమే ఎస్‌పిజి భద్రతను కల్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News