Thursday, January 23, 2025

737 మ్యాక్స్ విమానాలను ఆ పైలట్లు నడవకూడదు

- Advertisement -
- Advertisement -

SpiceJet 90 pilots barred from flying Boeing 737

90 మంది స్పైస్‌జెట్ పైలట్లపై డీజీసీఎ ఆంక్షలు

న్యూఢిల్లీ : స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు చెందిన 90 మంది పైలట్లు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నడపకూడదని డీజీసీఎ ఆదేశించింది. వారికి ఈ విమానాలను నడపడంలో సరైన శిక్షణ లేనట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైతే ఆ పైలట్లు మ్యాక్స్ విమానాలు నడపకుండా ఆదేశాలు జారీ చేశాం. వారు మరోసారి పూర్తిగా శిక్షణ పొందిన తరువాత విమానాలను నడపవచ్చు. లోపాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని డీజీసీఎ చీఫ్ అరుణ్‌కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో ఈ పైలట్లు మ్యాక్స్ సిమ్యూలేటర్‌పై మరోసారి శిక్షణ తీసుకోవాల్సి ఉంది. స్పైస్‌జెట్ వద్ద 737 మ్యాక్స్‌ను నడిపేందుకు 650 మంది పైలట్లు శిక్షణ పొందారు.

90 మంది పైలట్ల శిక్షణ ప్రొఫైల్‌ను పరిశీలించిన డీజీసీఎ వారు మ్యాక్స్ విమానాలు నడపకుండా నిషేధం విధించింది. దీంతో ఈ పైలట్లు మరోసారి శిక్షణకు వెళ్లి డీజీసీఎ ప్రమాణాలను అందుకోవాల్సి ఉంది. ఈ పైలట్లు బోయింగ్ 737 విమానాలు నడిపేందుకు మాత్రం అందుబాటులో ఉంటారు. 2019 లో ఇథియోపియాలో 737 మ్యాక్స్ విమానం ప్రమాదానికి గురి కావడంతో అదే ఏడాది మార్చి 12న భారత్ ఈ విమానాలపై నిషేధం విధించింది. బోయింగ్ సంస్థ ఈ విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంతో గత ఏడాది ఆగస్టులో వీటిపై నిషేధాన్ని తొలగించారు. 27 నెలల వ్యవధిలో పైలట్లు మ్యాక్స్ సిమూఊ్యలేటర్లపై పూర్తి స్థాయి శిక్షణ పొందాలని నిబంధన విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News