Wednesday, January 22, 2025

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం… నాలుగు గంటల పాటు

- Advertisement -
- Advertisement -

 

శంషాబాద్: స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 6:30 గంటలకు నాసిక్ బయలుదేరింది. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో పైలెట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు నాలుగు గంటలుగా విమానాశ్రయంలో వేచిచూస్తున్నారు. స్పైస్ జెట్ సంస్థ వారు మరో విమానం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నప్పటికీ విమానయాన సంస్థ పట్టించుకోవడంలేదని ఆందోళనకు దిగారు. ఈ విమానంలో 84 మంది ప్రయాణికులు ఉన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News