Monday, December 23, 2024

ఆటోపైలట్ లోపంతో స్పైస్‌జెట్ విమానం వాపసు

- Advertisement -
- Advertisement -

Spicejet Flight Return to Delhi after Autopilot Malfunction

న్యూఢిల్లీ: ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు గురువారం బయల్దేరిన స్పైస్‌జెట్ విమానం ఆటోపైలట్ లోపం కారణంగా మధ్యలోనే వాపసు వచ్చినట్లు డిజిసిఎ అధికారులు తెలిపారు. బోయింగ్ 737 విమానం సురక్షితంగా దిగినట్లు వారు చెప్పారు. ఢిల్లీ నుంచి నాసిక్‌కు వెళ్లే స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ విమానం ఎస్‌జి 8363 ఆటోపైలట్ లోపం కారణంగా గాలిలోనే వెనక్కు తిరిగివచ్చినట్లు డిజిసిఎ అధికారులు తెలిపారు. ఇంధన ధరల పెంపు, రూపాయి మారకం క్షీణించిన దరిమిలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు ఇటీవలి కాలంలో వరుసగా ఇటువంటి సంఘనటలే ఎదుర్కొంటున్నాయి. దీంతో ఎయిర్‌లైన్స్‌కు డిఇసిఎ షోకాజ్ నోటీసు కూడా జారీచేసింది. 8వారాలపాటు గరిష్ఠంగా 50 శాతం విమానాలను మాత్రమే ఆపరేట్ చేయాలని జులై 27న డిజిసిఎ స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీచేసింది.

Spicejet Flight Return to Delhi after Autopilot Malfunction

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News