- Advertisement -
న్యూఢిల్లీ : ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థలు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్‌లు బడ్జెట్ విమాన సంస్థ స్పైస్‌జెట్‌ను హై రిస్క్ కేటగిరీలోకి తీసుకున్నాయి. ఇప్పటి వరకు స్పైస్‌జెట్ ఎలాంటి లోన్ డిఫాల్ట్ కాలేదు, కానీ క్యాష్ ఫ్లోపై బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని విమాన సంస్థల విషయమై బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయి. స్పైస్‌జెట్ నుంచి హామీ కోసం చూస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. స్పైస్‌జెట్ గురించి ఎలాంటి సానుకూల వార్తలు లేవని, ప్రస్తుత పరిస్థితి ప్రోత్సాహకరంగా లేదని అంటున్నారు. అయితే స్పైస్‌జెట్ స్పందిస్తూ, ఎ బ్యాంకు కూడా హై అలర్ట్ చేపట్టలేదని పేర్కొంది.
- Advertisement -