Friday, November 22, 2024

గాల్లో విమానం ఉండగా.. ఎమర్జెన్సీ డోర్ తీయబోయాడు

- Advertisement -
- Advertisement -

SpiceJet passenger attempts to open emergency exit

వారణాసి: విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఈ  సంఘటన ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులందరూ భయాందోళనకు గురయ్యారు. విమాన సిబ్బంది, ప్రయాణికులు వెంటనే స్పందించి ప్రయాణికుడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సమయంలో విమానంలో 89 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని సిబ్బంది పోలీసులకు అప్పగించారు. అయితే ప్రయాణికుడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు వెల్లడించారు.

SpiceJet passenger attempts to open emergency exit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News