న్యూఢిల్లీ: దేశీయ బడ్జెట్ విమాన యాన సంస స్పైస్‌జెట్ 80 మంది పైలెట్లను మూడు నెలలు జీతం లేకుండా సెలవుపై పంపించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా తాత్కాలికంగా ఈ చర్య తీసుకున్నట్లు గుర్గావ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ ఎయిర్‌లైన్స్ మంగళవారం తెలియజేసింది. కొవిడ్ మ్హమ్మారి సమయంలో కూce ఏ ఉద్యోగిని సంస్థ తొలగించలేదని, అప్పటినుంచి పాటిస్తూ వస్తున్న ఈ విధానంలో భాగంగా ఈ చర్య తీసుకున్నామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. విమానాలు, పైలెట్ల సంఖ్యనుహేతుబద్ధం చేసేందుకు ఈ చర్య తోడ్పడుతుందని ఆ ప్రకటన తెలిపింది. ఇలా బలవంంతంగా సెలవుపై పంపిన వారిలో స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్, బంబార్డియర్ విమానాల్లో పని చేస్తున్న పైలెట్లు ఉన్నారు.కాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్ తీసుకున్న ఈ హటాత్ నిర్ణయంపై పైలెట్లలో కొంత మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్స్ ఆర్థిక సంక్షోభం గురించి మాకు తెలుసు. అయితే హటాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం మాలో చాలా మందిని షాక్‌కు గురి చేసింది. మూడు నెలల తర్వాత కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న గ్యారంటీ లేదు. అంతేకాదు, ఆ తర్వాత అయినా మమ్మల్ని తిరిగి విధుల్లో చేర్చుకుంటారన్న హామీ కూడా లేదు’ అని ఓ పైలెట్ అన్నారు.