Friday, December 20, 2024

టాప్ ప్లేయర్ గుడ్ బై.. రాజస్థాన్ రాయల్స్ కు షాక్

- Advertisement -
- Advertisement -

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ -2024 ప్రారంభమవుతోంది. ఫ్రాంచైజీలన్నీ పూర్తిస్థాయిలో సమాయత్తమవుతున్నాయి. వేసవిలో కుర్రకారుకు క్రీడావినోదం పంచిపెట్టేందుకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. జట్టు విజయాలలో ప్రముఖ పాత్ర వహిస్తూ వస్తున్న స్పిన్నర్ ఆడమ్ జంపా ఈసారి టోర్నీనుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల జంపా తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే జట్టునుంచి పేస్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ గాయం కారణంగా వైదొలిగాడు. టోర్నీ ప్రారంభం కాకముందే ఈ పరిణామాలు చోటు  చేసుకోవడంతో ఏం చేయాలో తోచక రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తల పట్టుకుంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News