- Advertisement -
ఐపిఎల్ 18వ సీజన్ శనివారం సాయంత్రం నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించి గుర్తింపు తెచ్చుకోవాలని యువ క్రీడాకారులు భావిస్తున్నారు. అయితే ఐపిఎల్‌లో కేవలం పరుగులు అడ్డుకోవడంపైనే స్పిన్నర్లు దృష్టి పెడుతున్నారని.. వికెట్లు తీయడంపై కాదని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు.
‘ఇలా నేను ఛెప్తున్నందుకు నన్ను క్షమించండి. చాలా మంది స్పిన్ బౌలర్లు ఫాస్ట్ బౌలర్లలా తయారవుతున్నారు. ఎటాకింగ్ చేయడం లేదు. వికెట్లు తీయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇంకాస్త ధైర్యంగా బౌలింగ్ వేయడం నేర్చుకోవాలి. అవకాశాలను సృష్టించుకుంటూ.. బంతిని స్పిన్ చేయాలి. ఫ్లైట్ డెలివరీలతో వికెట్లను టార్గెట్ చేయాలి.’ అని హర్భజన్ పేర్కొన్నారు. శనివారం రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపిఎల్ ప్రారంభంకానుంది.
- Advertisement -