Monday, January 20, 2025

వచ్చే ఏడాది జనవరి నుంచి ‘స్పిరిట్’

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం కల్కి 2898 ఎడి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఇపుడు ఒటిటిలో కూడా వచ్చి భారీ స్పందనను అందుకుంటుంది. ఈ చిత్రం తర్వాత మరిన్ని భారీ సినిమాలు ప్రభాస్ నుంచి రానున్నాయి. ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా చేయాల్సి ఉంది. స్పిరిట్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ప్రారంభమయ్యే లోపు ప్రభాస్ ఇతర సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది జనవరి నెల నుంచే మొదలు పెట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి రెగ్యులర్ షూటింగ్ కొనసాగించి ఆ ఏడాది చివర కానీ లేదా ఆ తరువాత ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ వంగా సంథింగ్ స్పెషల్‌గా తెరకెక్కించనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News