Tuesday, April 1, 2025

పండగ రోజు ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘స్పిరిట్’పై అప్‌డేట్

- Advertisement -
- Advertisement -

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సినిమాలతో వెండితెరపై తనదైన మార్క్ వేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. సందీప్ రెడ్డి సినిమాలు అంటే యూత్‌లో వేరే లెవల్ క్రేజ్ ఉంది. అయితే ఆయన తన తర్వాతి సినిమా రెబల్‌స్టార్ ప్రభాస్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ‘స్పిరిట్’ అనే టైటిల్‌తో రూపొందే ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. అయితే ఉగాది పండగ రోజు సందీప్ రెడ్డి ఫ్యాన్స్‌కి ‘స్పిరిట్‌’పై అప్‌డేట్ ఇచ్చారు. యూఎస్‌లో ఓ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పిరిట్ గురించి ఆయన్ను ప్రశ్నించగా.. చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని.. అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News